
నిన్నటి తరువాయి)
గోపాల్ గోడ్సే కథనము
త్రోవలో ఆప్టే అశీతాకాల ఉదయ సూర్యకిరణ దర్శనమునకు ఆనందించినట్లు కనబడినాడు. చాలాకాలము తర్వాతనే ఆ ఆనందమును ఆయన అనుభవించినాడు.
ఆయన అన్నాడు. ‘‘పండిత్! ఎంత ఆహ్లాదకరమైన సూర్య ప్రకాశము…’’ అప్పుడప్పుడు ఆయన నాథూరామ్‌ను ‘‘పండిత్’’ అని సంబోధించేవాడు.
నాథూరామ్ అన్నాడు ‘‘దీనిని నీవు చాలాకాలము తర్వాత చూస్తున్నావు. సిమ్లాలో ఇది సర్వ సాధారణమే’’.
‘‘నిజంగా ఇది స్వర్గం నుండి వచ్చినట్లున్నది’’
‘‘అవును ఈ పుణ్యకాలములో మన మాతృభూమి మన మీద అనుగ్రహించింది’’. అని సమర్థించినాడు నాథూరాం.
వేదికను సమీపించగానే మాతృదేశమును భక్తి జూపు గీతమును పఠించినారు
నమస్తే సదా వత్సలే మాతృభూమే,
త్వయా హిందుభూమే సుఖం వర్దితో హం!
మహామంగలే పుణ్యహమే త్వదర్థే
పతత్యేషకాయో నమస్తే నమస్తే!
సర్వదా నీకు నమస్కారము, ఓపవిత్ర మాతృదేవీ!
ఈ హిందూ భూమి పడిలో నీచే సుఖముగా పోషింపబడినాను.
అత్యంత మంగళకరమైన, ఓ పవిత్ర భూమీ
నీ కొరకు నా ప్రనాణములను సమర్పిస్తాను.
నమస్కారములు నీకు, నమస్కారములు నీకు!
వారి చేతులు వెనుకకు విరిచి కట్టబడినవి. ఉరి తీయువాడు వారి మెడకు ఉరిత్రాడు తగిలించి ఎక్కువగా వున్న తాటిని వారి భుజముల మీద వుంచినాడు. ఒక తాడుతో వారి బొటన వ్రేళ్లను కలిపి కట్టినాడు.
ఆ నిశ్శబ్ధ వాతావరణంలో, నూరు అడుగుల మేరకు, ప్రతిధ్వనించేటట్టు నాథూరాం, నారాయణ నినాదములు చేసినారు.
‘‘ఆఖండ భారత్ అమర్ రహే’’
‘‘వందేమాతరం’’
సూపరింటెండెంట ఉరి తీయువానికి పచ్చ చిహ్నము చూపినాడు. ఉరి తీయువాడు వెంటనే మీటను లాగినాడు.
వంతెన తెరచుకొనినది.
ప్రకృతి భూమ్యాకర్షణతో వారిద్ధరిని కౌగిలించుకొని, వారి ఆత్మలకు తన ఆదృశ్య రథమును అజ్ఞాత సంథలమునకు పంపినది. తాడు జారడంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఒక నెత్తురు బట్టు కూడా బయట పడలేదు.నాథూరాం మరణం తక్షణమే జరిగిపోయినవి. నారాయణ్ మోపకాళ్లు ఒకసారి గడ్డము వద్దకు చేర ప్రయత్నము చేసినవి. స్మృతిలేని పరిస్థిఇలోప రెండు మూడు నిమిషములు వణికిన తర్వాత ప్రాణములు అనంత వాయువులో కలసిపోయినవి.
అసిస్టెంటు సూపరింటెండెంటు శ్రీ రామనాథ శర్మ దహనమునకు ముందు జరుగవలసిన అంత్యక్రియలు జరిపినారు.
వారిరువురు చేతులలో యుంచుకొని వుండిన వస్తువులను గోపాల్ గోడ్సేకు చేర్చినారు.
దహన సంస్కారములు జైలు ఆవరణలోనే జరుపబడినవి.
నాథూరామ్ వీలునామా అతని తమ్ముడు దత్తాత్రేయకుమరునాడు చేర్చబడినది.
(రేపు యావజ్జీవ శిక్ష పొందినవారు)
