26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

కలకత్తా ఆర్జీకర్‌ కేసులో సంచలన తీర్పు

తెలంగాణ సామ్నా బ్యూరో:
గత సంవత్సరం ఆగస్టు 9న కొల్‌కత్తా లోని ఆర్జీకర్‌ ఆసుపత్రిలో జరిగిన హత్యాచారం ఘటనపై హైకోర్టు తీర్పు వెలువరించింది.
31 సంవత్సరాలు గల శిక్షణ పొందుతున్న మహిళా డాక్టర్‌పై సంజయ్‌రాయ్‌ అనే నిందితుడు హత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముద్ధాయిని అరెస్ట్‌ చేసిన కొల్‌కతా పోలీసులు సంజయ్‌ రాయ్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ వాదనల అనంతరం సంజయ్‌రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కొల్‌కత్తా హైకోర్టు తీర్పు వెలువరించింది.
అయితే సంజయ్‌ రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం పట్ల ప్రజల నుండి భిన్న వాదనలు వస్తున్నాయి. కొందరు నిందితునికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేస్తుండగా మరికొందరు అంత పెద్ద నేరానికి ఇంత శిక్ష వేయడం సబబు కాదని పెదవి విరుస్తున్నారు. హత్య చేయబడిన మహిళా డాక్టర్‌ కుటుంబానికి నష్ట పరిహరం ఇవ్వాలని కోర్టు అదేశించింది. అయితే ఆ డబ్బు తమకు వద్దని డాక్టర్‌ తల్లిదండ్రులు తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్ని కొద్ది నెలలు ఇరకాటంలో పెట్టిందనే చెప్పవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా హత్యాచారం చేయబడ్డ డాక్టర్‌ మృతికి సంతాపంగా యువకులు, విద్యార్థులు, వివిధ రాజకీయ పార్టీలు ధర్నాలు , రాస్తారోకోలు నిర్వహించాయి. సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరాయి. అయితే మమత బెనర్జీ ఇవేవి పట్పించుకోని ధోరణి కనిపించడంతో ఉద్యమం తారాస్థాయికి చేరింది. ఓ దశలో కేంద్రం చొరవ చూపించేత స్థాయిలో ధర్నాల ప్రభావం కనిపించింది.
దీనితో మమతా ప్రభుత్వం దిగివచ్చి విచారణ వేగవంతం చేసింది.
మొత్తానికి ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు అమరణాంత యావజ్జీవ జీవిత ఖైదు పడడంతో దేశవ్యాప్తంగా భిన్న వాదనలు మటుకు వినిపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles