ఎన్ డి ఏ భాగస్వామ్య లో ఉన్న రెండు ముఖ్య పార్టీలకు కేంద్రం దీపావళి బోనంజా ప్రకటించింది. ఏపీలో 2245 కోట్ల విలువైన 57 కిలోమీటర్ల అమరావతి రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే బీహార్ కు 453 కోట్ల విలువైన రెండు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాలకే సుమారు 6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించడం తో దేశవ్యాప్తంగా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది.
