26.1 C
Hyderabad
Saturday, August 1, 2026
No menu items!

ప్లాష్‌బ్యాక్‌…

(ప్రతి రోజు కొద్ది నిమిషాలు వాంగ్మూలం కోసం కేటాయించండి)

గతం కదులుతున్న రైలు లాంటిది. అందులో ఎందరో ప్రయాణం చేస్తు వుంటారు. వారి మంచి చెడ్డలతో గాని వారి ప్రవర్తనతో కాని వారి అవసరాలతో కాని ఆ రైలుకు సంబంధం లేదు. తన చివరి గమ్యం వరకు వెళ్లి ఆగిపోవడం మాత్రమే దానికి తెలుసు. మనందరి జీవితకాలం లాగా. ఇంకా చెప్పాలంటే ఆ కాలమే గతం. ఆ గతమే చరిత్ర. ఆ చరిత్రే ఎవరికి పట్టింపులేని అందరికి అవసరమైన రైలు లాంటిది. అంటే కాలం లాంటిది. ఆలాంటి రైలు యథావిథిగా ఓ రోజు తన ప్రయాణం ప్రారంభించింది. ఆ రోజు జనవరి 30 1948వ సంవత్సరం. ఆ రోజు భారతదేశ చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికున్ని హత్య చేశాడు. ఆ హత్య చేసిన వ్యక్తి నాథూరాం గాడ్సే. హత్యకు గురి కాబడిన వ్యక్తి మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ. ఆ సంఘటనతో కాలం ఒక్కసారిగా ఆగినంత పని అయ్యింది. హత్య చేసిన నాథూరాం గాడ్సే అరెస్ట్‌ కాబడ్డాడు. ఈ సంఘటన తరువాత భారతదేశం ఎంతో ప్రేమతో జాతిపితగా పిలుచుకునే మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ గారిని హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ప్రశ్న భారత ప్రజల్లో తలెత్తింది. గాడ్సే గురించి తీవ్రమైన చర్చ ప్రారంభమయ్యింది. అతను గాంధీని హత్య చేయడం అప్పటి రాజకీయ పరిస్థితులు, ఉద్రిక్తతల దృష్ట్యా కరెక్ట్‌ అనే వాదన ఒకవైపు వస్తే.. ఇలా చేయడం సబబు కాదు అనే విమర్శ మరోవైపు నుండి కూడా వచ్చింది. ఈ నేపథ్యలో తనను విచారిస్తున్న న్యాయస్థానంలో గాడ్సే చేసిన ‘‘వాంగ్మూలం‘‘ సంచలనం అయ్యింది. ఆనాటి వాంగ్మూలాన్ని ఆయన సొదరుడు గోపాలకృష్ట గొడ్సే పుస్తక రూపాన్ని కూడా ఇచ్చారు. ఆనాటి రాజకీయ పరిస్థితులు,ఉద్రిక్తతలు ఈనాటి తరానికి ‘‘మనమెక్కని రైలు ప్రమాదంకు గురయిన చందంగా’’ ఎవరికి పట్టనట్లుగా మిగిలిపోయింది.
కాని నాటి చరిత్ర తెలియని నేటి సమాజం రేపటికి స్పూర్తిని అందించలేదు. అందుకే మా ఈ చిన్న ప్రయత్నం. ఆనాటి రాజకీయ పరిస్థితులు, దేశ విభజన సమయంలో ఆనాటి భారతీయులు పడిన కష్టాలు, నష్టాలు ఎలాంటివి? వాటికి కారణం ఎవరు? అనే వాస్తవ చరిత్ర గురించి తెలియని భారతీయులు ఎందరో వున్నారు. ఇప్పటికి కొందరు వ్రాసిందే చరిత్ర అని కొందరు చెప్పిందే వేదం అనే భారతీయులు వున్నారనడంలో అతిశయోక్తి లేదు. చరిత్ర గురించి అవగాహన లేకపోతే భవిష్యత్తుకు రూపం వుండే అవకాశం లేదు. అందుకే అనాటి రాజకీయ పరిస్థితులు, విభజన సమయంలో ఆనాటి భారతీయులు పడిన కష్టాలతో పాటు నాథూరాం గాడ్సే మాటల తూటాలకు సమగ్రమైన అక్షరరూపం ‘‘వాంగ్మూలం‘‘ ద్వారా ప్రతిరోజు మీకు ‘‘తెలంగాణ సామ్నా’’లో ఉదయం 9 గంటలకు అందిచబోతున్నాం అని తెలపడానికి సంతోషిస్తున్నాము. ఇక ప్రతిరోజు ‘‘తెలంగాణ సామ్నా‘‘ వెబ్‌ లో వాంగ్మూలాన్ని చదివి మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపుతారని ఆశిస్తున్నాము.

భవధీయ
వాసం మారుతి ప్రసాద్‌
(తెలాంగాణ సామ్నా(telangana samna) వెబ్‌ను గూగూల్‌ ద్వారా బెల్‌ ఐకాన్‌ను నొక్కి సబ్ప్‌స్క్రయిబ్‌ చేయడం ద్వారా సులువుగా నోటిఫికేషన్‌ పొందే అవకాశం వుంది.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles