27.9 C
Hyderabad
Friday, June 5, 2026
No menu items!

నటుడు అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వద్దు:

తెలంగాణ సామ్నా: సినీ నటుడు అల్లు అర్జున్‌కు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వవద్దని సిటి పోలీసులు నాంపెల్లి కోర్టును కోరారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్‌ ముద్దాయిగా వున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ అరెస్ట్‌, బెయిల్‌, విడుదల అనే నాటకీయ పరిణామాల మధ్య నేటితో ముగియనున్న మధ్యంతర బెయిల్‌ పై నేడు విచారణ జరుగనున్న నేపథ్యంలో తాజాగా పోలీసులు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరీ చేయవద్దని కోర్టును కోరింది. ముద్ధాయికి పలుకుబడి, డబ్బు వున్న వ్యక్తి కావడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు వున్న నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వవద్ధని పోలీసులు కోరారు. తమకు విచారణకు సహకరించక పోవడం వల్లనే అరెస్ట్‌ చేశామని వారు తెలిపారు. మళ్లీ రెగ్యులర్‌ బెయిల్‌ ఇస్తే విచారణకు సహకరించకపోవచ్చు అనే అనుమానాన్ని పోలీసులు కోర్టుకు వ్యక్తపరిచారు. దర్యాప్తు ఇంకా కొకసాగుతున్న నేపథ్యంలో రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వవద్దని పోలీసులు కోర్టుకు విన్నవించుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles