దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సరికొత్త ముస్లిం లీగ్ పార్టీగా మారిందని బిజెపి అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ జిన్నా పార్టీల పనిచేస్తుందని బుజ్జగింపు రాజకీయాలు వాళ్లకు అలవాటేనని ఆయన అన్నారు. ముస్లిం ఓట్లు 30% కన్నా ఎక్కువగా ఉండే నియోజకవర్గాలను కాంగ్రెస్ తమ సేఫ్ జోన్ గా భావిస్తుందని ఆయన ఆరోపించారు. నెహ్రూ గాంధీ వాద్ర ఫ్యామిలీ వాటిని సేఫ్ జోన్ గా భావిస్తూ అక్కడే పోటీ చేయాలని ఆలోచిస్తున్నాయని అందులో భాగంగానే వయ నాడ్ లోప్రియాంక గాంధీ నామినేషన్ వేస్తుందని ఆయన అన్నారు
