(నిన్నటి తరువాయి)
గాంధీజీచే నిర్ణయింపబడి ఆచరింపబడిన నినాదాల, చిట్కాల వలన కలిగిన ఘోరవిపత్తులను, ఆయన అనుసరించిన విధానాల వలన ఇప్పటికే మనము గ్రహించిన విష ఫలితాలను గూర్చి సంక్షిప్తముగా ఇప్పుడు వివరిస్తాను. వాటిలో కొన్ని ఇవిÑ
(ఎ) ఖిలావత్: మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా ఆఫ్రికా, మధ్య ప్రాచ్యములలోని తన సామ్రాజ్య భాగములను చాలవరకు టర్కీ కోల్పోయింది.
యూరపులోని తన సామ్రాజ్య భూభాగములను పూర్తిగా నష్టపోయింది. 1914 సంవత్సరానికి దానికి యూరపులో మిగిలింది సుల్తాను, సింహసనాన్ని వదలుకొనేటట్లు చేసినారు. సుల్తాన్ పదవి పోవడంతో (ఖిలావత్) ఖలీఫా పదవి లేకుండా చేయబడినది. భారతీయ ముస్లింలకు ఖిలావత్ యెడ బలవత్తరమైన విశ్వాసము, అభిమానము, వారు ఖిలాఫత్‌ను బ్రిటిష్ వారే కూలద్రోసినారని నమ్మినారు. అందుచేత ఖిలాఫత్‌ను పునరుద్ధరించుటకు ఒక ఉద్యమాన్నే ప్రారంభించినారు. అవకాశవాద దోరణిలో, మహాత్ముడు ఖిలాఫత్ ఉద్యమమునకు సహకరించుట ద్వారా, అప్పటికే హిందువులకు నాటకుడుగా వున్న తాను ముస్లింలకు కూడా నాయకుడుగా పరిగణింపబడుతానని, దాని ద్వారా సాధింపచబడిన హిందూ ముస్లిం ఐకమత్యము వలన బ్రిటిష్‌వారు త్వరలో స్వరాజ్యము ఇవ్వవలసి వచ్చుననే దుర్భమలో పడినాడు. అయితే గాంధీజీ మరల తప్పు అంచానానలు చేసినాడు. ఖిలాఫత్ ఉద్యమముతో తాదాత్మ్యమే చెందునట్లు భారత జాతీయ కాంగ్రెస్‌ను నడిపించి మతపరమైన సమస్యను నిర్నిమిత్తముగ రాజకీయములలో ప్రవేశ పెట్టినాడు. దీని ఫలితము విషాదాంతము. అధిక మూల్యము చెల్లించవలసిన విపత్తుగా రుజువు అయినది.
తాత్కాలికంగా ఖిలాఫత్ పునరుద్ధరణకు జరిపే ఉద్యమము ఫలించునట్లుగా కనిపించింది. ఖిలాఫత్ ఉద్యమంలో చేరని ముస్లింలు పనికిమాలిన వారుగా పరిగణింపబడినారు. ఆ ఉద్యమానికి ప్రముఖ నాయకులుగా వుండిన ఆలీ సోదరులు ప్రజాదరణ, కీర్తి తరంగాలపై తేలుచూ, తన ముందుకు వచ్చి దానినెల్ల కైవసము చేసుకొనినారు. కొన్ని సంవత్సరముల వరకకు జిన్నా ఏకాకిగా విలువలేకుండా పోయినాడు. అయితే చివరకు ఉద్యమము విఫలమైపో యినది. మన బ్రిటిష్ యాజమాన్యం మాత్రం చెక్కు చెదరలేదు. అణిచితేవ విధానముతో ఒక వైపు, మాంటెంగు ఛమ్స్ఫర్డు సంస్కరణలతో మరియొక వైపు, వీటి రెండిరటి సంయుక్త ఫలితంగా కొద్ది సంవత్సరములలోనే ఖిలాఫత్ ఉద్యమాన్ని బలహీనపరచగల్గినారు. ముస్లింలు మాత్రం కాంగ్రెసు నుండి ప్రత్యేకముగా యుంచినారు. కాంగ్రెసు సహకారమునకు స్వాగతము పలికినారే గాని కాంగ్రెసులో లీనము కాలేదు. ఎప్పుడైతే ఓటమిని చవిచూచినారో అప్పుడు ముఇస్లంలు నిస్పృహతోÊ స్వార్థ్యమును కోల్పోయి తమ ఆగ్రహమును హిందువులపైకి మళ్లించినారు. భారత దేశములోని వివిధ ప్రాంతములలో లెక్కలేననన్ని కొట్లాటలు చెలరేగినవి. ప్రతి చోట ప్రధానంగా బాధితులు హిందువులే అయినారు. మహాత్మా గారి హిందూ ముస్లిం ఐక్యత చివరకు ఎండమావియే అయినది.
(ఇంకా వుంది)
