నిన్నటి తరువాయి
పాకిస్తాన్‌లోని అల్పసంఖ్యాకులను పాలించే పద్దతిని గురించి భారత ప్రభుత్వము గట్టినిరసనను తెలిపియుండినా, లేక ప్రతీకారముగా భారతదేశములోని ముస్లింలను అటువంటి పద్దతిలోనే చూస్తామని బదిరింపు బెదరించియకకుండినా ఈ అత్యాచారములు, రక్తస్నానములు కొతవరకు ఆపబడియుండేది. కానీ గాంధీజీ బొటనవ్రేలి కింద అణిగివుండే ప్రభుత్వము పూర్తిగా వేరు పద్దతులను అవలంభించింది. పాకిస్తాన్‌లోని అల్పసంఖ్యాకుల దుఃఖ గాధలను పత్రికలలో వినిపించేటట్లు చేసే యెడల దానిని వివిధ మతవర్గముల నడుమ విరోధములను రెచ్చగొట్టు ప్రయత్నముగా దుయ్యబట్టి అది ఒక నేరముగా చేయబడినది. పలు రాష్ట్రములలో వున్న కాంగ్రెసు ప్రబుత్వములు ఒకదాని వెనక ఒకటి ‘ప్రెస్‌ఎమర్జెన్సీ పవర్స్ చట్టము’ క్రింద పత్రికలనుండి ధరావత్తులు కోరసాగినవి. నా ఒక్కడినుండే 16000 రూపాయల దరావత్తు కోరుచూ నోటీసులు జారీచేయబడినవి. మురార్జీభాయి దేశాయి న్యాయస్థానములో చెప్పిన విధముగా ఒక బొంబాయి రాష్ట్రంలోనే ఇటువంటివి900 సందర్భములలో జరిగినవి. పత్రికా ప్రతినిధి వర్గములు మంత్రులను అనేకమార్లు కలుసుకొనినప్పటికి పత్రికల బాధలను సరిదిద్దుటకు ఏమీ చేయబడలేదు. ఆ విధముగ గాంధీయవాదముచే నడుపబడుచున్న కాంగ్రెసు ప్రభుత్వములపై శాంతియుతమైన మార్గముల ద్వారా ఒత్తిడి
తెచ్చుటకు చేసిన నా ప్రయత్నములలో పూర్తి నిరాశ మాత్రమే దక్కినది.
పాకిస్తాన్ ఇట్లా జరిగేవన్నీ జరిగిపోతుంటే గాంధీజీ కించిత్తు నిరసనను గాని ఆక్షేపణనుగాని పాకిస్తాన్ ప్రభుత్వానికి తత్సంబంధిత ముస్లింలకు తెలుపుచు పల్లెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పాకిస్తాన్‌లో హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని పెకలించివేయుటకు జరుపబడిన ముస్లింల దారుణ అత్యాచారములన్ని పూర్తి గాంధీజీ ప్రభోధములు, ఆయన ప్రవర్తన వల్లనే జరిగినవి.భారత రాజకీయములను ప్రయోజనాత్మక దృక్పథంతో నడిపి వుండివుంటే ఇప్పుడు జరిగనటువంటి దారుణమైన మానవ హత్యాకాండ చరిత్రలో ఇటువంటిది ఏనాడూ జరిగి యుండలేదు జరిగివుండదు.
చాలా ముఖ్యమైన గుర్తు పెట్టుకోవవలసిన విషయము ఏమిటంటే, గాంధీజీ ముస్లింల విషయము వచ్చునప్పుడు ప్రజాభిప్రాయమును ఏనాడు గాని లెక్కచేయలేదు. ఇప్పుడు ఆయన అహింసా ప్రభోదగీతము లోతైన నెత్తురు మడుగులో నానవేయబడినది. ఇక ప్రజలు పాకిస్తాన్‌ను గురించి మంచి అనుకోవడం అసాధ్యమైపోయినది. భారత సమాఖ్య ప్రక్కన ఒక మత సిద్ధాంతముపై నిర్మింపబడిన రాజ్యము వున్నంత కాలము, సమాఖ్య మొక్క శాంతి భద్రతలు అపాయ స్థితిలోనే వుంటూ వుంటాయి. ఇట్టి పరిస్థితులు వున్నప్పటికిని గాంధీజీ కరడుగట్టిన ముస్లింలీగు భక్తుడు కూడా చేయలేని విధముగా ప్రజల హృదయములలో పాకిస్తాన్‌ను గురించి విరోధభావములు వ్యాపించకుండా ప్రచారము చేయు కార్యభారమును తన చేతులోనికి తీసుకొనినాడు.
సరిగ్గా ఈ కాలములోనే గాంధీజీ మరణ పర్యంత నిరాహార దీక్షల పూనుకొనినాడు. నిరాహారదీక్షను విరమించుటకు ఆయన విధాంచిన నిబంధనలలో ప్రతి ఒక్కటి ముస్లింలకు అనుకూలముగను, హిందువులకు ప్రతికూలముగను వుండినది.
(మిగితా రేపు)
