26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం “గాంధీహత్య’’

(నిన్నటి తరువాయి)

పంజాబులో మరణించినవారిలో ఒక్కడైనా తిరిగిరాడు. తుదకు మనము కూడా అక్కడికే పోవలిసియున్నది. వారు హత్య చేయబడినాదనే విషయము నిజమే. కాని ఇతరులు చాలమంది కలరా వలనలో లేక ఇతర కారణముల వలననో మరణిస్తూనే వున్నారు. జన్మించిన ప్రతివారు ఏమీ కోల్పోలేదు సరికదా కొంత సంపాదించుకొనినవారైనారు. అయితే ఈ మానవ హత్యాకాండను సాగించినవారిని ఏమీ చేయవలెను అని ఒక పెద్ద ప్రశ్న. మానవుడు పొరపాట్లు చేస్తాడని ఒప్పుకోవచ్చు. మనిషంటేనే ఒక తప్పులమూట. పంజాబులో మన సంరక్షణ బ్రిటిష్‌ సైన్యము బాధ్యత. ఐతే ఇదేనా సంరక్షణ? కొద్ది మందైనా సరే. తమను తాము రక్షించుకోవలెననేది నా కోరిక. వారు మరణమును గూర్చి బయపడరాదు. ఇందులో ఏమున్నది. చంపినవారు మన ముస్లిం సోదరులే కాని మరెవ్వరూ కారుగదా? మనము మాత్రము వారివలెనే ప్రవర్తించమా? బీహారులోని స్త్రీల విషయంములో మనము చేయని పని అంటూ ఏమి వున్నది?

హిందువుల హృదయాలలోప జనించిన ప్రతీకారేచ్చ ఒక సహజమైన ప్రతిస్పందనమని గాంధీజీ గమనించి యుండవలసినది. ముస్లిం రాష్ట్రాలలో వేలకొలది, హిందువులు, వారు హిందువులనే కారణము వలన ఊచకోత కోయబడుతూ వుంటే మన ప్రభుత్వము ఈ దురధృష్టవంతులకుఎలాంటి సహాయముగాని సంరక్షణ గాని సమకూర్చలేకపోయినది. ఆ రాష్ట్రములోని హిందువల దు:ఖ క్లేశ తరంగాలు ఇతర రాష్ట్రములలోని హిందువుల మనస్సులపై హృదయాలపై తీవ్రముగా పనిచేసినవంటే, అందులో అసహజమైన విషయము ఏమున్నది? అదిఅసహజమైనది ఏ మాత్రమ కాదు. ఎందువల్లనంటే ఇటువంటి ప్రతిక్రియలు కరుణాపూరితమైన మానవత్వమునకు చిహ్నములు. ఆ రాష్ట్రములోలోని తమ సోదరులకు సంభవించిన విషాదాల నుండి విపత్తులనుండి కాపాడి వారికి సంరక్షణ ఇవ్వవలెననే ఏకైక లక్ష్యముతోనే ముస్లింలపై ప్రతీకార చర్యలకు పూనుకొనినారు. ముస్లింల అత్యాచారములను నిరోధించుటకు అదొక్కటే మార్గముగ హిందువులు విశ్వసించినారు. ఎప్పుడైతే హిందువులు ప్రతీకార చర్యలు తీసుకొనినారంటే అవి ఇతర రాష్ట్రములలో జరిగిన వ్పిరబాంతిని గొలిపే అత్యాచారములు హిందువుల మనస్సులపై కావించిన ఆ ఘుతము అనివార్య ఫలితములే. ఒక్కొక్కపుపడు ఈ భావము ‘‘కరుణ’’ వలె ఆధ్యాత్మికము సహజము.

మహావిప్లవములలోప చాలామటుకు పాలకుల దుశ్చర్యలకు వ్యతిరేకముగ తీవ్రమైన అసంతృప్తి వలన కల్గిన ఇటువంటి భావమువలననే విజయము పొందినది. నియంతలకు వ్యతిరేకమగ అసంతృప్లి, ప్రతీకారము పగతీర్చుకోవడము అనే భావములు ప్రేరేపణ లేకపోతే సమాజముపూ దుర్మార్గుల పెత్తనమును అంతము చేయుట సాధ్యము కాదు. రామాయణ మహాభారతములలో వర్ణించిన ప్రాచీన చరిత్రలలోని సంఘటనలు లేక జర్మనీ జపానులకు వ్యతిరేకముగ జరిగిన ఆధునిక యుద్దములు అదే విధమైన చర్య. ప్రతిచర్యలను సూచిస్తున్నవి. అది మంచి కానివ్వండి లేక చెడ్డ కానివ్వండి అది మానవనైజము.

(మిగితా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles