గాంధీజీ రాజకీయాలు ఒక నిశిత పరిశీలన
ప్రథమ పరిచ్ఛేదము
- 1948 జనవరి 30వ తేదిన జరిగిన సంఘటనకు నేపథ్యము పూర్తిగా రాజకీయమైనది. దానిని కొంత దీర్ఘముగ వివరించుచున్నాను.
గాంధీజీ, హిందువుల, ముస్లింల, ఇతర మరస్థుల గ్రంథముల గౌరవించి తన ప్రార్థనలలో గీతతనుండి, ఖురాన్ నుండి బైబిల్ నుండా గీతములను పఠించుట వలన అతనిపై నెలాంటి చెడు భావము కలిగియుండులేదు. నా అభిప్రాయములో మతములను సమన్వయముతో ఆధ్యయనము చేయుటలో దోషమేమియు లేదు. అంతేకాదు. అట్లు చేయుట ఒక సుగుణమని కూడా నా తలంపు. - ఉత్తరమున వాయువ్య సరిహద్దు ప్రాంతము, దక్షిణమున కన్యాకుమారి మరియు కచ్ అస్సాముల మధ్యనున్న భూభాగము, అనగా దేశ విభజనకు పూర్వము వునన భారతదేశము ఎల్లప్పుడు నా మాతృభూమిగా యున్నది, ఈ విశృాల భూభాగంలో విభిన్న విశ్వాసములు గల ప్రజలు నివసించుచున్నారు. వారందరు తమ నమ్మకములను దర్మములను పాటించుటకు సంపూర్ణ స్వాతంత్య్రమును సమానత్వమును కలిగియుండవలెనని నేను దృఢ విశ్వాసము కలిగియున్నాను. ఈ భూభాగములో హిందువులు అధిక సంఖ్యాకులు. ఈ దేశమును దాటి అవతలివైపున తమది అనుకొనదగు ప్రదేశమేదియు వారికి లేదు. అందువలన పురాతన కాలమునుండి హిందూస్థాన్ హిందువులకు మాతృభూమి, పుణ్యభూమి అయి యున్నది. తన కీర్తి ప్రతిష్ఠలను, సంస్కృతి కళలను, జ్ఞాన విజ్ఞాన శాస్త్రములను, వేదాంతములను, ఈ దేశము హిందువుల నుండి పొంది యున్నది. ఇతర జాతులనుండి సంక్రమించుకొని యుండలేదు. ఇచ్చట హిందువుల తర్వాత సంఖ్యలో ప్రాముఖ్యత కల్గియున్నారు. వారు ఏడవ శతాబ్ధము నుండి దేశములోనికి ఒక పద్దతిలో చొచ్చుకొని వచ్చి క్రమేపి భారతదేశములో అధిక ప్రాంతములు ముస్లింల రాజ్యమును ఏర్పాటు చేయగల్గినారు.
(తరువాయి రేపు)
