తల్లిదండ్రులకు శాపం.. పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం..
ఓ రిక్షావాడు తన కొడుకును కనీసం ఆటో బండికి ఓనరునైనా చేయాలని కలలు కంటాడు. లేదా కనీసం తన కూతురును కనీసం ఓ ఆటో ఓనరు చేతిలో పెట్టాలని అనుకుంటాడు. ఎందుకంటే తన సంతానం తన కంటే పై స్థాయిలో పవుండాలని కోరుకుంటారు కాబట్టి. ఓ ఎమ్మెల్యే కూడా తన కొడుకును ఎంపియో లేదా మంత్రినో చేయాలని అనుకోడా? తన సంతానం తన కంటే పై స్థాయిలో వుంటే ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు వుంటాయా? ఆ ఆనందం విలువే వేరు. ఆ సంతోషం మజాయే వేరు. దానిని కొలవడానికి ఏ కొలమానం సరిపోదు. తమ పిల్లల ద్వారా తమకు మంచిపేరుతో పాటుగా గుర్తింపు రావాలని కొరుకోని తల్లిదండ్రులు బహుశ వుండరేమో!
(తెలంగాణ సామ్నా డెస్క్)
అలాగే ఆ తండ్రి కూడా ఆలోచించాడు. ఆ తండ్రి ఓ మండల కేంద్రానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో వుండే ఓ పల్లెటూరిలో ప్రైవేట్ వైద్యుడు. ఆ గ్రామంలోనే వుంటు వైద్యసేవలు అందిస్తు జీవనం సాగిస్తున్న వ్యక్తి. భార్య బీడిలు చుడుతు భర్తకు చేదోడు వాదోడుగా వుండేడిది. వారికి ఒక కూతురు ఒక కొడుకు. డాక్టరు తన వైద్య సేవలతో పాటుగా తమ గ్రామంలోని వారు దగ్గరలో వున్న పట్టణంలో ఇల్లు జాగాలు కొనలానుకునే వారికి మధ్యవర్తిత్వం చేనే వ్యాపారం కూడా చేసేవాడు. అలాగే బీమా ఎజెంట్‌గా కూడా పనిచేసవాడు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబంతో పాటుగా ఆ గ్రామంలో పలుకుబడితో అతని కుటుంబ జీవనం సాఫీగా సాగేది. అలా అటు వైద్యవృత్తిలోను ఇటు వ్యాపారంలోను మంచిగా సంపాదించాడు ఆ డాక్టరు. తనకు ఈ పలుకుబడి, సంపాదన తాను డాక్టరు కావడం వల్లనే వచ్చిందని లేకుండా తనలాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎవరు గుర్తించేవారనే ఫీలింగ్ ఆ డాక్టర్‌కు వుండేడిది. అందుకే తన ఇద్ధరు సంతానాన్ని ఎలాగైనా డాక్టర్లను చేయాలని అనుకునేడివాడు.
డాక్టర్లు కావాలంటే మంచి చదువు కావాలనే తపనతో డాక్టరులో వుండేడిది. దానితో ఆ గ్రామంలో ఏడవ తరగతి పూర్తయ్యాకా కూతురును, కొడుకును మండల కేంద్రంలో వున్న స్కూల్‌కు పంపించాడు. పదవ తరగతి వరకు అక్కడ చదివాకా తన ఆశయ సాధన అయిన డాక్టరు ఇలా గ్రామీణప్రాంతంలో వుండే కాలేజీలో చదివే రాదని జిల్లా కేంద్రంలోని రెసిడెన్షియల్ కార్పొరేట్ కాలేజీలో బైపిసీలో కూతురును జాయిన్ చేశాడు. పదవ తరగతిలో అరకొర మార్కులతో పాసు అయిన కూతురుకు జీవిత లక్ష్యం, గమ్యం, ధ్యాస, భవిష్యత్తు గురించి వివరించి కాలేజీలో చేర్పించి వచ్చారు ఆ డాక్టరు దంపతులు. కూతురును బైపిసిలో చేర్పించిన మొదటిరోజు నుండే తన కూతురు కాబోయే డాక్టర్ అని ఫిక్స్ అయ్యాడు ఆ డాక్టరు. కూతురును బైపిసిలో జాయిన్ చేయించినాకా గ్రామంలో తెలిసిన వారు ‘‘ఇంకేంది డాక్టర్ సాబ్. ఆరు ఏడు ఎండ్లు అయితే మాకు ఇంకొక డాక్టరు సూదీలు గోళీలు ఇస్తది’’ అని ఎవరైనా అంటే ఆ డాక్టరు పొంగిపోయేడివాడు.
అలా చూస్తు వుండగానే ఆ అమ్మాయిది మొదటి సంవత్సరం పూర్తి అయ్యింది. అయితే ఆ అమ్మాయికి ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదు. మూడు సబ్జెక్ట్లల్లో ఫెయిల్ కూడా అయ్యింది. డాక్టర్ అవుతుంది అనుకున్న తన కూతురు మొదటి సంవత్సరంలోనే ఈ స్థాయి ప్రతిభ చూపెట్టే సరికి డాక్టరు తట్టుకోలేకపోయాడు. కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిసాడు. లెక్చరర్లను కలిశాడు. వారందరు చెప్పింది ఒక్కటే. అమ్మాయి ఆక్టివ్‌గా వుండదు. ఎప్పుడు చదువు గురించి పట్టించుకోదు. ఎప్పుడు ఎదో ఒకటి ఆలోచిన్తు వుంటుంది అని. డాక్టరుకు ఆర్థం కాలేదు. తాను ఇంత ఖర్చు చేసి చదివిస్తున్నాను. పైగా ఆలోచించడానికి ఏం వుంది? అడవిలో నెమలిలా హాయిగా ఆడుకుంటు పాడుకుంటు చదువుకునే వ్యవస్థ ఏర్పాటు చేసిన తరువాత కూడా తన కూతురు ఎందుకు చదవడం లేదు అనే ఆలోచన డాక్టరుకు వచ్చింది. కూతురు ఎందుకు చదవడం లేదనే విషయం ఇపుడు తేలకపోతే ఇక రెండవ సంవత్సరంలో చదువు ఇంకా కష్టం అవుతుందని గ్రహించాడు. కూతురుతో పాటుగా వుండే స్నేహితురాళ్లతో మాట్లాడాడు. వారు ఖరాఖండిగా ఒకటే చెప్పారు. ‘‘అంకుల్ మీ అమ్మాయికి ఇంటిమీద ధ్యాస ఎక్కువ. ఎప్పుడు మిమ్మల్ని, ఆంటీని తలుచుకుంటుంది. ఏ పేరంట్ వచ్చినా ఫోన్ అడుక్కొని మీతో గాని ఆంటీతో గాని చాలా సేపు మాట్లాడిన తరువాత ఇక చదువు మీద ఎలా శ్రద్ధ వస్తుంది?’’ అని ఓ అమ్మాయి ఖరాఖండిగా చెప్పేసింది.
అదివిన్న డాక్టర్ ఆశ్చర్యపోయాడు. తనతో గాని తన భార్యతో గాని తమ కూతురు ప్రతిరోజు మాట్లాడిరదే లేదు. అలాంటిది వీరు ఇలా అంటున్నారు ఏంటి? అని అనుకున్నాడు. మౌనంగా క్యాంపస్ నుండి బయటకు వచ్చాడు. డాక్టర్ మనసు ఎక్కడో కీడు శంకిస్తుంది. నాకు తెలియకుండా ఏదో జరిగింది. ఇంకా ఏందో జరుగుతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడువు అతని కళ్లు వర్షించాయి.
(మిగితా రేపు)
