37 C
Hyderabad
Wednesday, June 17, 2026
No menu items!

టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా కొండ్లెపు అర్జున్ నియామకం

(బాలే అజయ్ – 9290277727)

జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రానికి చెందిన కొండ్లెపు అర్జున్ మోచి ను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేందర్ పాల్ గౌతమ్ నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా కొండ్లెపు అర్జున్ మోచి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎస్సీ ఉపకులాలకు ప్రాధాన్యత ఇస్తూ తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానని తెలిపారు.

తన నియామకానికి సహకరించిన టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, అలాగే 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles