ఝార్ఖండ్ రాష్ట్రంలో ఈనెలలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో బిజెపి తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ప్రతి మహిళకు నెలకు రూపాయలు రెండు వేల ఒక వంద ఆర్థిక సాయం గా బిజెపి హామీ ఇచ్చింది. రూపాయలు 500 కి గ్యాస్ సిలిండర్ తో పాటు ఏడాదికి రెండు ఉచితంగా తెలిపింది. ఐదు సంవత్సరాల్లో యువతకు ఐదు లక్షల స్వయం ఉపాధి అవకాశాలు ఇస్తామని తెలిపింది. 287 ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై హామీ ఇచ్చింది. గిరిజన వర్గాలను మినహాయించి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు అలాగే పొరపాటు దారులు గిరిజన మహిళను వివాహం చేసుకుంటే గిరిజన క్యాటగిరి ఇవ్వడానికి నిరాకరణ అనే ముఖ్య అంశాలతో బిజెపి తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
