
తెలంగాణ సామ్న: వెయ్యి కాకులను తిన్న గద్ధ ఒక్క గాలివాటుకు నేలరాలినట్లు అవుతోంది పాకిస్థాన్ పరిస్థితి. ఓవైపు ప్రజలకు తినడానికి గోధుమపిండి కూడా కరువై విపరీతమైన దుర్భరదారిద్ర దిశకు చేరుకుంటున్న పాకిస్థాన్ కింద పడ్డ పర్వాలేదు కాని కాళ్లు మీదన వున్నాయి చూడు అనే చందంగా తూర్పు అఫ్ఘనిస్థాన్‌పై వైమానిక దాడి జరిపింది. దీనికి ప్రతీకారంగా కాబుల్ నుండి పాక్ సరిహద్దుల్లోకి అఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం 15 వేల మంది తాలిబన్ సైన్యాన్ని తరలిస్తున్నట్లు తెలిపింది. దీనితో భారత్‌ను అనుకొని వున్న రెండు ముఖ్య ముస్లిం దేశాల మధ్య శతృత్వ వైఖరి తమకు పనికిమాలిన గొడవగా మారి ఇబ్బంది పడేలా వుంటుందని భారత రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత్ ముందస్తు చర్యలు తీసుకోనుందని సమాచారం. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన నాటినుండి ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాలిబన్ ప్రభుత్వం ఎర్పడ్డాకా పాకిస్థాన్‌లో టిటిపి ఉగ్రదాడుల్ని విపరీతంగా చేసింది. దీనితో ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిని ఒకరిపై ఒకరు వైమానికి దాడులు, సైనిక దాడులు చేసుకునేంతంగా పెరిగాయి. కాగా ఇరుదేశాల మధ్య పెరిగిన అగాధాన్ని భారత యువత జజ్జనకరి జనారే అన్నట్టుగా కొంత ఉత్సాహంగా గమనిస్తున్నట్లు తెలుస్తున్నది.
