35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

కోరుట్ల పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కస్తూరి లక్ష్మీనారాయణ నియామకం

(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)

కోరుట్ల పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా 11వ వార్డు కౌన్సిలర్ కస్తూరి లక్ష్మీ నారాయణను నియమించారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ నాయకుడు డా. అనూప్ రావు నివాసంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, డా. అనూప్ రావు, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ కలిసి నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని ప్రజా సమస్యలపై బీజేపీ తరఫున సమర్థవంతంగా పోరాడాలని, మున్సిపల్ స్థాయిలో పార్టీ స్వరాన్ని మరింత బలంగా వినిపించేలా కృషి చేయాలని సూచించారు.

నూతన అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఇందూరు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, డా. అనూప్ రావు, రుద్ర శ్రీనివాస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూ, పార్టీ కార్యకర్తలతో సమన్వయం సాధించి ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమల వాసు, బొడ్ల రమేష్, గుంటుక సదాశివ్, చెట్లపెల్లి సాగర్, ఎర్ర రాజేందర్, ధోనికెల నవీన్, సంకట విజయ్, రాగంశెట్టి సాయి కృష్ణ, తులసి కృష్ణ, బేక్కం అశోక్, రాధారాపు సత్యనారాయణ, ప్రేమ్ సాగర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles