
జగిత్యాల జిల్లా బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.బిజెపి జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం బిజెపి శ్రేణులు అందజేశాయి .ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్షులు వడ్డేపల్లి శ్రీనివాసన్,నలువాల తిరుపతి,బీజేపీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు డా.అనూప్ రావు,బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్,BJYM రాష్ట్ర నాయకులు దొనికెల నవీన్ జిల్లా పదాధికారులు, కోరుట్ల అసెంబ్లీ, జగిత్యాల అసెంబ్లీ, ధర్మపురి అసెంబ్లీకి చెందిన బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
