
తెలంగాణ సామ్నా బ్యూరో:ఈ ఫార్మా కారు రేసులో కేటిఆర్ మాటలు మేకపోతు గాంభీర్యమేనా? ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో ఏమాత్రం అవగాహన వున్న వ్యక్తులైన చర్చిస్తున్న విషయం ఇది. కొద్ది రోజుల క్రితం అదో లొట్టపీసు కేసు భయపడేది లేదు అని గంభీరంగా పలికిన గొంతు రెండు రోజుల క్రితం ప్రజాస్వామ్య బద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కేసును ఎదుర్కొంటా అని వెనక్కి తగ్గింది. గొంతులో గాంభీర్యO తగ్గనట్టు కనిపిస్తున్నా గుండెల్లో అలజడి మాత్రం ప్రజలకు ఆర్థం అవుతుందని చాలా మంది చెబుతున్న మాట. ఈ మాటలు అంటున్నది, ప్రజలు గమనిస్తున్నది బారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావ్ గురింది.
ఫార్మూలా ఈ కార్ రేసులో ఏసిబి ఫైల్ చేసిన కేసు గురించి. కారు గుర్తుతో ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని అందుకొని ఆ ‘‘కారు’’తోనే పార్టీ పరువు తీసుకునే పరిస్థితి రావడం కొందరు అభిమానులకు రుచించడం లేదన్న వాదన వస్తున్నది.గాంభీర్యత పోయింది అనే భావనకు పర్యాయ లక్షణమే లాయర్ తనతో పాటుగా వుండాలని హైకోర్టును ఆశ్రయించడం అనే వాదన వస్తున్నది. హైకోర్టు లాయర్‌ను విచారణ గదిలోకి అనుమతించక పోవడం అనేది కేటిఆర్ మానసిక బలంపై కొంత వ్యతిరేకత చూపిందనే అభిప్రాయం చాలామందిలో నెలకొంది.
కేటిఆర్ కంటే ముందు విచారణకు వెళ్లిన వారు కేటిఆర్‌నే బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్‌రాజ్‌ను చూపినట్లు ‘‘అంతే మీరే చేశారు’’ లాంటి విషయాలు విచారణలో చెప్పినట్లు లీకైన తరువాత అటు ఏసిబి కాని ఇటు ఈడీ కాని కేటిఆర్ మాటల్ని నమ్ముతుందని ఎవరు అనుకోరు అనే వాదన వస్తున్నది.
ముగ్గురు నిందితుల్లో ఇద్దరు కేటిఆర్‌నే ముద్ధాయిగా చూపించిన తరువాత రేపటి ఏసిబి నిర్ణయాలు ఏలా వుంటాయో ప్రజలు చాలా సులభంగా ఊహించే అవకాశాలు వుండే అవకాశాలు వుంటాయి అనేది సత్యం. అందులో ఈ కేసులో కళ్ల ముందు కనిపిస్తున్న అనుమానాలను ఇంతవరకు ప్రత్యక్షంగా కాని మీడియా ముఖంగా గాని కేటిఆర్ అధారాలతో ఖండిoచిన దాఖలాలు లేవు అనే విమర్శ వస్తున్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచడానికి ఆగం ఆగం ఎన్నికల కోడ్ అమలులో వున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపాల్సిన అవసరం ఏం వచ్చింది? అనే అతి సాధారణ ప్రశ్నకు కూడా కేటిఆర్ జవాబు చెప్పడం లేదు అనే విమర్శ వెల్లువెత్తుతున్నది.
రూ 700ల కోట్ల లాభం వచ్చింది అని చెప్పడమే కాని ఏ విధంగా వచ్చింది? ఏవరికి వచ్చింది? అనే ప్రశ్నకు జవాబు కేటిఆర్ చెప్పడం లేదన్న వాదన కూడా వస్తున్నది. రేసు నిర్వహించే కంపనీ గ్రీన్‌కో మధ్యంతరంగా వెళ్లిపోతే ఆ కంపనీపై కేసు పెట్టకుండా ఆ బాద్యతను సంబంధం లేని హెచ్‌ఎండిఏ కు అంటగట్టి డబ్బులు రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా, రాష్ట్ర మంత్రి వర్గానికి తెలుపకుండా నిధులు మళ్లించడం ఏమిటి?అనే చిన్న చిన్న అనుమానాలకు కేటిఆర్ నుండి జవాబు రాలేదన్న విమర్శ వస్తున్నది. కేటిఆర్ ప్రజల ముందుకు వచ్చి తీర్చాల్సిన అనుమానాలు కొన్ని అయితే అధికారులకు చెప్పాల్సినవి కొన్ని వున్నాయన్న వాదన వస్తున్నది. అన్నిటికి నేను కేసిఆర్ బిడ్డను, తప్పు చేయను. ఏం చేసినా తెలంగాణ అభివృద్ధి కోసమే చేశాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెంచడానికి చేశాను. ఈ కార్ల అభివృద్ధి కోసమే ఈ కార్ రేసు నిర్వహించామని అంగట్లో కూరగాయల బేరం చేసినట్లు చెబితే అటు ప్రజలు ఇటు అధికారులు నమ్మే పరిస్థితి లేదని కొందరు విమర్శిస్తున్నారు.
ఒకవైపు ఏసిబి మరోవైపు నుండి ఈడీ చేస్తున్న విచారణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయ్యి రాజకీయంగా చర్చలకు, పరస్పర విమర్శలకు దారి తీసి తీవ్ర చర్చలకు దారి తీస్తున్నదన్న వాదన మటుకు వస్తున్నది. మొత్తానికి ‘‘కారు’’ గుర్తుపై గెలిచి ఆ ‘కారు రేసు’’లో ముద్ధాయిగా కేటిఆర్ విచారణను ఎదుర్కోవడం యాదృశ్చికమే అయినా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో మటుకు తీవ్ర చర్చనీయాంశంగా మారింది అనడంలో సందేహం లేదు.
