తెలంగాణ సామ్నా బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మూడు ఎమ్మేల్సీ స్థానాలకు బీజేపి తమ అభ్యర్థులను ప్రకటించింది. అదిలాబాద్, నిజామాబాద్, కరినగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిగా అంజిరెడ్డి, ఇవే నాలుగు పాత జిల్లాల ఎమ్మేల్సీ అభ్యర్థిగా కొమురయ్య, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గానికి సరోత్తంరెడ్డిలను తమ అభ్యర్థులాగా బీజేపి ప్రకటించింది.
