సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శక్తి స్కీం లో భాగంగా అక్కడి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం పై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణంపై తమ ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా ప్రయాణం చేయటానికి శ్రద్ధ చూపించడం లేదని ఆయన అన్నారు. సోషల్ మీడియా ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని చాలామంది మహిళలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ఈ పథకంపై పునరాలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేర్కొన్నారు
