భారతదేశం వన్ నేషన్ వన్ సివిల్ కోడ్ వైపుగా వెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇప్పటికే వన్ నేషన్, ఐడెంటిటీ ఆధార్, వన్ నేషన్, వన్ టాక్స్, జీఎస్టీ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. వన్ రేషన్ కార్డ్, వన్ ఇన్సూరెన్స్,ఆయుష్మాన్ భారత్, వన్ పవర్ గ్రిడ్లను తీసుకొచ్చామన్నారు. భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు
