
తెలంగాణ సామ్నా: జగిత్యాల జిల్లా లోని ఓ అయ్యప్ప గుడిపై రాజకీయ నీలి మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. గత దశాబ్దన్నర కాలంగా ఎలాంటి వివాదాలు లేకుండా సాగిన అయ్యప్ప గుడి వ్యవహరం ప్రస్తుతం రాజకీయ పట్టింపులతో, ప్రొటోకాల్ వ్యవహరంలో ఆ మణికంఠున్ని సైతం కంట నీరు తెప్పించే విధంగా కష్టాలు తేవాలనుకుంటున్నారన్న వివాదం చెలరేగుతోంది.
తెల్లబట్టల ఆసాములు నల్లబట్టల అయ్యప్పను కేవలం ఓ వ్యక్తి లేదా పార్టీ అనే ఉద్ధేశ్యంతో గుడిని సాకుగా చేసుకొని పెత్తనం చేయాలనుకుంటున్నట్లు అయ్యప్ప భక్తుల్లో గుసగుసలు బయలుదేరాయి.
ఇంకా రాజకీయ పరువు ప్రతిష్ఠ మొదటిదశలోనే అగ్గి బుక్కుకుంటున్న కొందరు నాయకులు సదరు నాయకులను ఇబ్బంది పెట్టాలనే ఉద్ధేశ్యంతో అయ్యప్పగుడిని అడ్డంగా పెట్టుకొని రాజకీయ పెత్తనంచేయాలని చూస్తున్నారని ఒకరి చెవుల్లో ఒకరు చెప్పుకునే గుసగుసల స్థాయిలో తీవ్రంగా వైరల్ అవుతున్నట్లు తెలుస్తున్నది.
వివరాల్లోకి వెళితే.. అందిన సమాచారం మేరకు…, మెట్‌పల్లి పట్టణ కేంద్రంలో అయ్యప్ప గుడి నిర్మాణమై నిత్య పూజలు అందుకొని భక్త జనానికి అపద్భాందవుడుగా వెలుగుతున్న సంగతి తెలిసినదే. ఇంతవరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిన గుడి నిర్వహణపై కొందరు రాజకీయ నాయకుల కన్ను పడిOదని సమాచారం. ఆ సదరు నాయకులకు కూడా భక్తి భావం ఎక్కువే అనే ప్రచారం వుంది. అయితే ఇక్కడ భక్తి విషయం కాకుండా గుడిలో తమకు దొరకని మర్యాద విషయంలో వారు గుర్రుగా వున్నట్లు తెలుస్తున్నది. వారి కోపం అయ్యప్పపై కాకున్న అక్కడ బాధ్యతగా వ్యవహరిస్తున్న కొందరు వ్యక్తులపై కావడం, వారు పరస్పర విరుద్ధ రాజకీయపార్టీలకు చెందిన వారు అనే ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం. దీనితో సూటిగా మర్యాద పొందలేక ఒకరు, సూటిగా మర్యాద ఇవ్వలేక ఇంకొకరు వున్న నేపథ్యం అక్కడ వున్నట్లు తెలుస్తోంది. దీనితో ఎలాగైనా వారిని ఇబ్బంది పెట్టాలని ఓ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నట్లు వినికిడి. ఆ తరువాత సదరు వ్యతిరేక పార్టీవారు దిగి వచ్చిన తరువాత లేదా తమ అస్థిత్వాన్ని నిలుపుకునేంత వరకు గుడి వ్యవహారం వదిలేయకూడదని ఆలోచన చేస్తున్నట్లు చూచాయగా అందిన సమాచారం. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. వారి పార్టీలు వేరు కావచ్చు కాని ఇద్దరు దైవభక్తులే. దేవుని మీద అచంచల భక్తి, భయం వున్న వారే అనే ప్రచారం జరుగుతుంది. కాకపోతే మర్యాద విషయం తక్కువ కావడం యిష్టంలేని సదరు నాయకుని ప్రమధగణాలు నాయకున్ని తప్పు తోవ పట్టించి గుడి ప్రదేశం మాదే అని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అధికారులచే గుడికి నోటీసులు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి.
