శనివారం ఉదయం నుండి రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఫేక్ కాల్స్ వస్తున్నట్లుగా సమాచారం వస్తున్నది. టెలికం డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నామని మీరు కస్టమర్ కేర్ తో మాట్లాడటానికి తొమ్మిది నెంబర్ నొక్కండి అంటూ ఒక ఆడ గొంతు వినిపిస్తోంది. అయితే మళ్లీ కట్ చేసి సదరు నెంబర్ కు ఫోన్ చేస్తే ఎవరు స్పందించడం లేదు. దీనిపై వినియోగదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్గా వచ్చే కస్టమర్ కేర్ ఫోన్లు కాకుండా ఈ కాల్ తేడాగా కనిపిస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఫేక్ కాల్ అని గుర్తించిన వెంటనే వారి సూచనలు పాటించకపోవడం మంచిదని వినియోగదారులు చెబుతున్నారు. ఈ విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పలువురు కోరుతున్నారు
