సంఘటనల సరళి నిందితులు
ప్రేలుడు ఘటన

1948 జనవరి 20వ తారీఖు…
భారత రాజధాని కొత్త డిల్లీలోని బిర్లా భవనపు ప్రహరీగోడకు సమీపంలో ఒక ప్రేలుడు సంభవించింది. అది గన్ కాటన్ స్లాబ్ వలన జరిగిన ప్రేలుడు. గోడ కొంత మేరకు దెబ్బ తినినది. అపుడు గాంధీజీ డిల్లీలోని బిర్లా భవనములో నివసించుచుండినారు. ఆ ప్రాంగణములోనే ఆయన తన ప్రార్థనా సమావేశములను జరుపుకొనుచుండేవారు.
ఆ దినములలో డిల్లీలోను, దేశములోని ఇతర ప్రాంతములలోను పరిస్థితులు అత్యంత ఉద్రేకముతోను క్రోధావేశములతోను నిండియుండినవి. అంతకు కొద్ది నెలలలకు ముందుగా జరిగిన హిందూస్థాన్ విభజన వల్ల ఇట్టి పరిస్థితి ఏర్పడినది. ‘‘స్థాన్’’ అనగా ‘‘భూమి’’. హిందుస్థానములో నుండి ఒక భాగము తెగ గొట్టబడి, పాకిస్థాన్ (పవిత్రభూమి) అను పేరుతో ముస్లిం మతసంబంధమైన స్వతంత్ర రాజ్యముగా ఏర్పరచబడినది. అదే సమయంలో బ్రిటిష్ దాస్యము నుడి విముక్తి నొందిన మిగితా హిందూస్థానమునకు ‘‘భారత్’’ అను మరియొక్క నామకారణము జరిగినది.
భారత జాతీయ కాంగ్రెస్, రాజకీయములలో ప్రధాన పక్షముగ నుండినది. కాంగ్రెసు నాయకులు ఆ రోజులలో, హిందు ముస్లిం ఐక్యత, మతాతీత లౌకిక విధానముల మోజులో నుండినారు. వారు, తాము నమ్మిన, ప్రభోదించిన సిద్ధాంతములకు వ్యతిరేకముగ హిందూ భూమిలో ఒక ముస్లిం మత మౌఢ్య రాజ్యమును గుర్తించుటకు అంగీకరించినారు. ఇది ఆ నాయకుల ఓటమి. వారి సిద్ధాంతాలకు ఓటమి. వారు తమ సిద్ధాంతాలను హిందువులపై మాత్రమే నియంతృత్వముగా రుద్ధ గల్గిన కపటవర్తనులు. తమ ఓటమిని కప్పి పుచ్చుకొనుటకు హిందువులను ఒక జాతిగా గుర్తించక, వారిని ఒక తెగగా మాత్రమే పరిగణించినారు. తమకు తగిన విపరీత పద్ధతిలో లౌకిక పద్దతిలో లౌకిక రాజ్యాంగాన్ని ఇండియాపై రుద్దినారు.
నిజానికి ‘‘ఇండియా’’అనే పదం బ్రిటిష్‌వారు గ్రహించిన ‘‘హిందూస్థాన్’’ అనే పదానికి అపభ్రంశమైన రూపము. ‘‘భారత్’’ అనునుది కూడా హిందూస్థానమునకు ఆఖండ భారతదేశాన్ని సూచించే పురాతనమైన మరియొక పేరు. కాంగ్రెసు నాయకులు మాత్రము హిందువుల ఆధిక్యము సూచించి హిందూస్థాన్‌తోని ముస్లింలను నొప్పించే పేరును దూరంగా వుంచాలని భావించినారు. అంటే ఆచరణలో, లౌకిక, రాజ్యం అనగా ముస్లింలను సంతృస్తి పరచడం అని ఆర్థము.
దేశ విభజన వేదన వెంటనే సామూహిక హత్యలు, స్త్రీలపై అత్యాచారములు, హింసాకాండ, మొత్తానికి మొత్తంగా జనప్రవాసము ఇవి నిత్యకృత్యములయిన సంఘటనలు అయినవి.
మహాత్ముడు ఉన్నతమైన ఆత్మగలవాడుగా ప్రసిద్ధి నొందిన గాంధీ రాజకీయములలో ప్రధాన పాత్ర వహించినారు. దేశవిభజన వలన అష్టకష్టముల పాలైన హిందువులు ఆయనతో విశ్వసోదర భావములను పంచుకొనినవారు ఆయనపై ఆగ్రహించినారు. ఆయనపై ఏదైనా దౌర్జన్యము జరుగవచ్చుననే భావంతో బిర్లా భవనము వద్ద పోలస్‌ల రక్షణ ఏర్పాటు చేయబడినది. (రెండవభాగం jan 2న)

