తెలంగాణ సామ్నా: డిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోతున్నాడు. లిక్కర్ స్కాంలో ఎల్‌జి విచారణకు అనుమతి ఇవ్వడంతో ఆత్మరక్షణ ధోరణి ఆయనలో మొదలైనట్లు చెబుతున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని లేకపోతే రాజకీయంగా, వ్యక్తిగతంగా చీకటి వుంటుందనే ఆలోచనలో ఆయన వున్నట్లు తెలుస్తుంది. పార్టీ తరపున ప్రకటిస్తున్న పథకాలుపై విమర్శలు వెల్లువెత్తుతున్న పట్టించుకోకుండా తమ కార్యకర్తలకు ఇంటింటా తిరిగా సర్వేలు చేయమని, పేర్లు నమోదు చేయమని పురామాయిస్తున్న వైనం డిల్లీ ఓటర్లలో ఆప్ అంటేనే నవ్వుకునేలా చేస్తున్నది అనే విమర్శ వస్తున్నది.
తాజాగా ఆరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ుకు లేఖ వ్రాసారు. బీజేపి ఇంతవరకు చేసిన తప్పులకు ఆర్‌ఎస్‌ఎస్ మద్ధతు ఇస్తుందా? అని లేఖలో పెర్కోన్నాడు. బీజేసి డిల్లీలో డబ్బులు పంచుతున్నది, ఓట్ల కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నది. వాటికి మీరు మద్ధతు ఇస్తారా? అని ప్రశ్నించాడు. పూర్వాంచల్, దళితుల ఓట్లను భారీగా తొలగిస్తున్నారు, దీనికి మీరు మద్దతు ఇస్తారా? బీజేపి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నదని ఆర్‌ఎస్‌ఎస్ అనుకోవడం లేదా? అంటూ ఆరవింద్ కేజ్రీవాల్
తన లేఖలో పెర్కోన్నారు. అయితే రాజకీయంగా బలహీన పడుతున్న కేజ్రీవాల్ తన ఫెయిల్యూర్స్‌ను కప్పిపుచ్చుకోవడానికి దళితులు, వృద్ధులు, పూర్వాంచల్ అనే సెంటిమెంట్‌ను వాడుకుంటున్నాడని మిగితా పార్టీలు విమర్శిస్తున్నాయి.
కేజ్రీవాల్ ఉత్తరానికి బీజేపి చాలా ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఆ పార్టీ నేత వీరేంద్ర సచ్‌దేవ్ కేజ్రీవాల్‌కు పోస్ట్‌కార్డుతో సమాధానం ఇవ్వడం ప్రత్యేకతగా నిలిచింది. కొత్త సంవత్సరంలో తీర్మానాలు చాలా సహజంగా వస్తాయి. కాని లిక్కర్ స్కాం, యమునానది ప్రక్షాళన, అవినీతిపై చెప్పిన అబద్ధాలతో పాటుగా రాజకీయాల కోసం జాతివ్యతిరేక శక్తుల నుండి విరాళాలు తీసుకొనని ముందుగా ప్రమాణం చేయండి అని సచ్‌దేవ్ కేజ్రీవాల్‌కు ప్రత్యుత్తరం ఇచ్చాడు.
