తెలంగాణ సామ్నా డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ కుదుపులకు కారణమవుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటిఆర్ గురువారం ఈడీ ఎదుట హజరు కావాల్సివుంది. నేడు ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు వెళ్లాల్సివుంది.
ఏసిబి తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కేటిఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను తిరస్కరించిన సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో కేటిఆర్ నేడు ఈడీ విచారణకు ఆ తరువాత ఏసిబి విచారణకు హజరు కావాల్సి వస్తుంది.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఏ2,ఏ3లను విచారించిన నేపథ్యంలో కేటిఆర్ నేటి విచారణకు ప్రాధాన్యత సంతరించుకుందన్న వ్యాఖ్యానాలు వస్తున్నాయి.
