26.2 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాధురాం గోడ్సే వాంగ్ములం “గాంధీహత్య”

(నిన్నటి తరువాయి)


సుహ్రవర్దీకి ఆదరణ:
లార్డు వేవెల్‌ పండిత నెహ్రును ఆహ్వానించి ఏర్పాటు చేయమని కోరిన తాత్కాలిక ప్రభుత్వములో ముస్లింలీగు చేరుటకు నిరాకరించిన సందర్భములో నెహ్రు ఏర్పరచబోవు ప్రభుత్వమునకు వ్యతిరేకముగ ప్రత్యక్షచర్య జరుపుటకు లీగు ఒక కార్యాచరణ సంఘమును ఏర్పాటు చేసినది. నెహ్రు పదవీ స్వీకరణకు రెండువారములకు కొంచెము ముందుగా 1946 అగస్లు 15వ తేదీన కలకత్లాలో బహిరంగముగ హిందువుల సామూహిక సంహారము చెలరేగి మూడు దినముల పాటు అడ్డు ఆపు లేకుండా కొనసాగినది. ఈ మూడు దినములలో జిరగిన భయానక సంఘటనలను కలకత్తా నుండి వచ్చు ‘‘స్టేట్‌మెన్‌’ పత్రిక ప్రకటించింది. తన పౌరులపై అట్టి అత్యాచారములు జరుపుటను అనుమతించినట్టి ప్రభుత్వం వెంటనే పడగొట్టవలెనని ఆనాడు భావించబడినది. సుహ్రవర్దీ ప్రభుత్వము వెంటనే డిస్మిస్‌ చేయవలెనని రూఢమైిన ప్రతిపాదనలు వుండినవి. కాని 1932 భారత చట్టములోని 93వ సెక్షన్‌ క్రింద పరిపాలనకు స్వాధీనము చేసుకనుటకు సామ్యవాద గవర్నరు నిరాకరించినాడు. ఇట్లు అయినప్పటికీ, గాంధీజీ కలకత్తాకు పోయి జరిగిన జన సంహారమునకు కారణభూతుడైన వానితో వింత చెలిమి ఏర్పాటు చేసుకొనినాడు. మూడు దినములు జరిగిన హిందూజన సంహార సమయములో వారి మాన ప్రాణ ఆస్థులను సంరక్షించుటకు కలకత్తా పోలీసులు ఎటువంటి ప్రయత్నము చేయలేదు

. న్యాయ సంరక్షకుల కండ్ల ముందే లెక్కలేనన్ని అత్యాచారములు జరిగిపోయినవి. కానీ గాంధీజీకి ఇదంతా పెద్ద విషయములుగా తోచలేదు. ఇప్పుడు ఆయన దృష్టిని ఎటూ మళ్లీంచుటకు వీలు లేనంతగా సుహ్రవర్దీని శ్లాఘించుటలో నిమగ్నమైపోయినాడు. సుహ్రవర్దీని ఆత్మత్యాగ వీరుడని బహిరంగముగా వర్ణించినాడు. ఇట్టి స్థితిలో రెండు నెలల తర్వాత నౌకాళీ, తిప్పెరాలతో కనీవినీ ఎరుగనంత ఎత్తున ముస్లిం దౌర్జన్యములు చెలరేగినప్పుడు ఆశ్చర్యమేమీ లేదు. ఆర్యసమాజము ఇచ్చిన ఒక లెక్క ప్రకారము 30000 హిందూ స్త్రీలు ముస్లిం మతములోనికి బలవంతముగా మార్చబడినారు. కోట్లకొలది రూపాయల విలువగల ఆస్థి లూటీ చేయబడుటో ధ్వంసము చేయబడుటో జరుగగా, మూడు లక్షల హిందువులు చంపడబడుటో తీవ్రముగా గాయపరుచబడటో జరిగినది. అప్పుడు గాంధీజీ పెద్ద ఆడంబరముతో నౌకాశీ జిల్లాలో ఒంటరిగా పర్యటన చేయ పూనుకొనినాడు. కాని ఆయన ఎక్కడికి పోయినా గట్టి రక్షణను సుహ్రవర్దీ ఏర్పాటు చేయడం బహిరంగ రహస్యమే. కానీ అంత రక్షణ ఏర్పాట్లతో కూడా గాంధీజీ నౌకాశీ జిల్లాలో ప్రవేశించుటకు సాహసించలేకపోయినాడు. ఈ అత్యాచారములన్నీ, ప్రాణనష్టము ఆస్థి నష్టము, సుహ్రవర్దీ ప్రధానమంత్రిగా నున్నపుడే జరిగినవి. అట్టి న్యాయహీనుడు మతోన్మాద విషపూరితుడైన రాక్షసునికి గాంధీజీ కోరకనే ఆత్మ త్యాగవీరుడు అని బిరుదు ప్రధానము చేసినాడు.

(మిగతా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles