25.9 C
Hyderabad
Sunday, August 2, 2026
No menu items!

నాథురాం గోడ్సే వాంగ్ములం ‘గాంధీ హత్య’

(నిన్నటి తరువాయి)

గాంధీజీ బౌతికావశేష చితాభస్మము ` భారతదేశములో ఇతర దేశములలో అన్ని పెద్ద పట్టణములలో ప్రదర్శించి, చాలా నదులలోను కలిపినారు. కాని, పాకిస్తాన్‌లోని భారత హై కమిషనర్‌ శ్రీశ్రీ ప్రకాశ ఎంత ప్రయత్నము చేసినప్పటికిన్నీ పాకిస్తాన్‌ గుండా ప్రవహించు పవిత్ర సింధూ నదీ జాలలో ఆయన చితాభస్మమును నిమజ్జనము చేయుటకు వీలుపడలేదు. ఈ విషయమును ఇచ్చట ముచ్చటించుటలో అసందర్బమేమీలేదని నేను భావిస్తున్నాను.

ఇక తర్వాత 55 కోట్ల రూపాయల విషయము తీసుకొందాము. ఇక్కడ 1948 ఫిబ్రవరి 2వ తేదీ నాటి ‘ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌’ (భారత సమాచారము) నుండి ఈ క్రింద ఇవ్వబడిన భాగములను చదువలసి యున్నది.
ఏ ప్రభుత్వాన్నైనా సరే తాను తీసుకొనిన నిర్ణయములను మార్చుకొనేటట్టు చేయడం కష్టమని, గాంధీజీ స్వయముగా ఈ 5 కోట్ల రూపాయలను ఇవ్వకుండ నిలిపివేయవలెనని చేసుకొనిన మొదటి నిర్ణయాన్ని తిరుగదోడి, మార్పుచేసినది. ఇట్లా చేయడానికి కారణము గాంధీజీ మరణాంత నిరాహార దదీక్ష (1948 జనవరి 21వ తేదీ) ఆ ప్రాంతములలో ప్రార్ధన సమావేశములలో గాంధీజీ ధర్మోపన్యాసము. ప్రజా ప్రభుత్వముగ చాటుకొనే మన ప్రభుత్వముచే పాకిస్తాన్‌కు 55 కోట్ల రూపాయలను ఇ్వవకుండా నిలిపి వుంచవలెననే నిర్ణయము తీసుకొనబడినది. కాని ప్రజా ప్రభుత్వము యొక్క ఈ నిర్ణయము గాంధీజీ నిరాహారదీక్ష గానమునకు వంతపాటగా మార్పుచేయబడినది. గాంధీజీ పాకిస్తాన్‌ అనుకూల అభిప్రాయములతో పోల్చినప్పుడు ప్రజాభిప్రాయ శక్తి ఎందుకు కొరగానిదిగా నా మనస్సుకు స్పష్టమైనది.

భారతదేశములో జాతీయోద్యమమునకు ముస్లింలు వ్యతిరేకించిన దానికి ప్రతిఫలముగ పాకిస్తాన్‌ ఏర్పడినది. పాకిస్తాన్‌కు విధేయమలైన చాలమందిని ఇదే ప్రభుత్వము పంచమాంగదళ సభ్యులుగా శంకించి కారాగారములలో బంధించినది. కాని నా ఉద్దేశములో గాంధీజీయే అందరికన్న ఎక్కువగా పాకిస్తాన్‌ను బలపరచువాడు, దానికి ఆధివక్త. ఆయన ఈ వైఖరి విషయములో ఆయన మీద ఏ శక్తికి గూడా అదుపులో పట్టగలిగిన శక్తి లేకపోయినది.

ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రపంచమునుండి గాంధీజీని తొలగించడమొక్కటే, ముస్లిం అత్యాచారములనుండి హిందువుకు విముక్తి కలిగించుటకు, సరిన విరుగుడు మందుగా నేను భావించినాను.

తరువాయి రేపు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles