(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో సోమవారం బలిదాన్ దివస్ సందర్భంగా బీజేపీ నాయకులు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం చెట్పల్లి ఓం ప్రకాష్, చట్పల్లి సాగర్, ఎర్ర రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, శివరామ్ రాజ్ గురు మరియు సుఖదేవ్ థాపర్ త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో బల్కా ప్రేమ్ సాగర్, తోకల రాహుల్, కే. నవీన్, మారుతీ, లోకినీ వర్ధన్, భాను, పల్లికొండ రాజేష్, లోకిని మణిచరణ్, సుమంత్, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.
