1947 లో దేశ విభజన జరిగిన సమయంలోనే అప్పటి ముస్లింలందరినీ పాకిస్తాన్ కు పంపించేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి గిరిరాజు సింగ్ అన్నారు. మతం ఆధారంగా దేశాన్ని విభజించి ఉంటే ఇప్పుడు ఎవరు కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగి ఉండేవారు కాదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు రాజకీయాలకు పాల్పడే వారే సనాతన ధర్మాన్ని హిందుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

