దేశ ప్రజలు ప్రధాని మోదీకి మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఇచ్చారని పార్లమెంటు వ్యవహారాల మంత్రి కిరణ్ అన్నారు. అయితే ప్రతిపక్షాలు ప్రజల నిర్ణయాన్ని అవమానపరుస్తున్నాయని ఆయన విమర్శించారు. బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ అంశాలను ప్రస్తావించకుండా ప్రతిపక్షాలు అనవసర కాలయాపన చేసి గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇకరైనా ప్రతిపక్షాలు తమ ప్రతిపక్ష స్థాయి హోదాను కాపాడుకునే విధంగా వ్యవహరిస్తారని ఆయన ఆశించారు.
