కాలపరిమితి ముగిసిన తెలంగాణ పంచాయతీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన మంత్రి సీతక్క ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. పంచాయితీ కాలపరిమితి ముగిసి సుమారు 6 నెలలు కావస్తున్న ఎన్నికల నిర్ణయంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేదు. దీనితోపాటు సుప్రీం ఆదేశాలను కూడా పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ల అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
