(పిట్ట రాజేష్, కోరుట్ల ఆర్.సి)
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ( TRP ) కోరుట్ల పట్టణ అధ్యక్షుడు ఎన్నం రాజశేఖర్ టీ. ఆర్ పి పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు సాయిని పాపన్న ఆధ్వర్యంలో పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న ను హైదరబాద్ లోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు సమస్యల గురించి వారు మల్లన్నతో చర్చించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ అన్ని సమస్యలకు పార్టీ అధికారం రావటం ఒక్కటే పరిష్కారం అని తెలిపారు, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. పార్టీ బలోపేతం చేసే క్రమంలో కార్యకర్తల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే గంటల్లో అక్కడుంటానని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే నేరుగా నాకే ఫోన్ చేయండి” అని మల్లన్న స్పష్టం చేశారు, రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా సముచిత వాటా, రాజ్యాధికారం దక్కాలంటే ప్రజలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్పీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీసీల రాజ్యాధికారం, సామాజిక న్యాయం లక్ష్యంగా సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మల్లన్న ఈ సందర్భంగా వెల్లడించారు. పాదయాత్రతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
