(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ లెక్కింపులో దేవాలయానికి మొత్తం రూ. 90,576/- ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అలాగే హుండీ లెక్కింపులో బంగారం లేదా వెండి వంటి విలువైన లోహాలు లభించలేదని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా డివిజన్ ఇన్స్పెక్టర్ ఎం. రాజమౌళి, ఈఓ ఎం. విక్రమ్ గౌడ్, ఎతిరాజం నరసయ్య, ధర్మకర్త కటుకం దివాకర్, శ్రీమతి చిట్యాల పద్మ, నేతి శ్రీనివాస్, చిలువేరి విజయ, గుడికె రాములు, కోట గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ పీ. నరసయ్య, పూజారి బి. నరసింహాచారి, అలాగే భక్తులు రమేష్ గుప్తా, టి. మహేశ్, శ్రీమతి వి. భాగ్యలక్ష్మి, బి. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
