
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల పట్టణ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ పదవుల కోసం ఆదివారం కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు హాజరయ్యారు.
33 వార్డుల నుంచి సుమారు 200 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టికెట్ దక్కిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ ఏకతాటిపై నిలవాలని సూచించారు.
