
(బాలె అజయ్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల–మెట్పల్లి జాతీయ రహదారిపై జీఎస్ గార్డెన్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్పల్లి నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును, అదే మార్గంలో ప్రయాణిస్తున్న టీఎస్ 16 ఎఫ్ హెచ్ 8716 నంబర్ గల కారు ఢీ కొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు సమాచారం.
ప్రమాద సమయంలో కారులో ఉన్న వారు జాతర కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు.
