(పిట్ట రాజేష్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల మండలం కల్లూరు గ్రామంలోని ప్రెస్టేజ్ పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన నలంద ఇంటర్నేషనల్ సీబీఎస్సీ కరికులం డే & రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం వసంత పంచమి సందర్భంగా శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పాల్గొని స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతో పాటు విలువలతో కూడిన విద్యా విధానం విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సీబీఎస్సీ విద్య అందుబాటులోకి రావడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి, బిజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని స్కూల్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.

