(పిట్ట రాజేష్, కోరుట్ల ఆర్.సి)
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ రెండు నెలల క్రితం మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పరామర్శించారు. సురభి నవీన్ కుమార్ మరియు బీజేపీ మండల, గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తల సహకారంతో రాహుల్ కుటుంబానికి మొత్తం రూ.41,555 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ, రాహుల్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాహుల్ చెల్లెలి ఉన్నత విద్యకు అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తానని భరోసా ఇచ్చారు.
కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సురభి నవీన్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు, గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
