(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
కోరుట్ల పట్టణంలోని జూనియర్ కళాశాల గ్రౌండ్‌లో మండల స్థాయి SGF క్రీడలు సోమవారం ప్రారంభమయ్యాయి. మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత–గంగాధర్ ఆధ్వర్యంలో క్రీడలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ఖో-ఖో, వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గంగుల నరేశం, మండల కన్వీనర్ బి. శ్రీనివాస్, ట్రాస్మా అధ్యక్షుడు భారీ, స్థానిక కౌన్సిలర్ వాసింతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
