(బాలే అజయ్ – 9290277727, జగిత్యాల)
లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల ఆధ్వర్యంలో భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం జగిత్యాల వారి సహకారంతో రేకుర్తి కంటి వైద్యశాల ద్వారా సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో మొత్తం 63 మందికి కంటి చూపు పరీక్షలు నిర్వహించగా, వారిలో 42 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆపరేషన్ అవసరమైన వారిని డాక్టర్ భాస్కర్ మాడేకర్, లయన్స్ చిదుర సురేష్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి వైద్యశాలకు లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసిన ఉచిత బస్ ప్రయాణం ద్వారా కరీంనగర్‌కు తరలించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గుండెటీ గంగాధర్, కార్యదర్శి అడువల జ్యోతి, ట్రెజరర్ పోతు గణేష్, అలాగే తాటిపాముల వినోద్ కుమార్, వడ్లగట్ట శంకర్, శ్రీరాముల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సభ్యులు మనపూరి శ్రీనివాస్, కాసారపు లక్ష్మీనారాయణ గౌడ్, పొన్నగంటి సతీష్, ముల్లెరాజ్ కుమార్, చిలివేరి రాజ్ కుమార్, సామల శ్రీహరి, కొమ్మినేని మల్లేశం, బత్తుల ప్రదీప్, ధోపాటి దేవదాస్, శ్యాంసుందర్తో పాటు భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
