( బాలే అజయ్, కోరుట్ల)
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్లాపూర్ గ్రామంలో ఒక ఇంటి వద్ద డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట (3 Cards Game) ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం సమాచారం అందడంతో పోలీసు అధికారులు దాడి నిర్వహించారు.
కోరుట్ల ఎస్సై జి. శ్యామ్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుండి పేకాటకు పందెంగా ఉపయోగిస్తున్న రూ.1,63,100/- నగదు, 52 పేక ముక్కలు మరియు 5 మొబైల్ ఫోన్లను పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై గేమింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సే తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సే శ్యామ్ రాజ్ డబ్బులు పందెంగా పెట్టి పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తమ పరిసరాల్లో జూదం లేదా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్సే కోరారు.
