25.6 C
Hyderabad
Friday, October 30, 2026
No menu items!

ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన కోరుట్ల బీజేపీ

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని పురస్కరించుకుని కోరుట్ల పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ వై. అనూప్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

తొలుత కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డులో గల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు.

అనంతరం గడి స్కూల్‌లో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ధర్మపురి అరవింద్ జన్మదినాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం, దళిత మోర్చా, కిసాన్ మోర్చా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles