(బాలే అజయ్ – 9290277727, మెట్పల్లి)
ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆలయానికి చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలతో పాటు మెట్పల్లి పట్టణ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రైసుద్దీన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
