(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
మోహన్‌రావుపేట గ్రామంలోని అంబేద్కర్ సంఘానికి (మాదిగ సంఘం) మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు.
గ్రామంలో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు మినీ ఫంక్షన్ హాల్ అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వినతిని సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తమ వినతికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, గ్రామ సర్పంచ్ సరికెళ్ల లతిక నరేష్‌లకు అంబేద్కర్ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు శనిగారపు వినోద్, శనిగారపు రాజయ్య, నల్ల గంగరాజం, లింగంపల్లి చిన్న నర్సయ్య, మంతెన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
