30.8 C
Hyderabad
Thursday, September 17, 2026
No menu items!

గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు సురభి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు

(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)

కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్ గ్రామ ప్రజల కోరిక మేరకు వారి తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సురభి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ బుధవారం రోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లి రాణి రాజు, ఉపసర్పంచ్ బాసవేణి రమేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పృథ్వి, వార్డు సభ్యులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తుకారాం గౌడ్, కోరుట్ల మండల అధ్యక్షుడు పంచరి విజయ్, మండల ప్రధాన కార్యదర్శి గోపు ప్రశాంత్, పార్టీ నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు, బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు, అభిమానులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles