(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ పునః ప్రతిష్ఠ జరిగి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా 22 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు పడిగేల శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు ఆలయ అర్చకులు పాలేపు రాము శర్మ వైదిక నిర్వహణలో మహిళలు సహస్ర నామ పారాయణం చేశారు. అనంతరం 1008 కలశాలతో అమ్మవారి మూల విరాట్ విగ్రహానికి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన జలాన్ని భక్తులు స్వయంగా అభిషేకించేలా సంఘ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పడిగేల పవన్, సంఘ అధ్యక్షులు పడిగేల శ్రీనివాస్, కార్యదర్శి ఎలిమి బుచ్చన్న, కోశాధికారి చౌదరి సూర్యకాంత్, మహిళా అధ్యక్షురాలు, బూస మాధురి, మాజీ అధ్యక్షులు నీలి కాశీనాథ్, కోటగిరి ప్రసాద్, అల్లాడి ప్రవీణ్, మోటూరి రాజేంద్రప్రసాద్, మాజీ మండలాధ్యక్షులు పి. జలంధర్, పిఆర్ఓ బట్టు హరికృష్ణ, వాసవి క్లబ్ సీనియర్ సిటిజెన్ అధ్యక్షులు కొత్త గణేష్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
