(తెలంగాణ సామ్నా డెస్క్)
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో సోమవారం జరిగిన పురపాలక సంఘ చైర్మన్ ఎన్నికల్లో జరిగిన రాజకీయ పరిణామాలు జిల్లా బీజేపిలో ప్రకంపనలు రేపింది. 10 స్థానాలు వుండి చైర్మన్ స్థానాన్ని గెలుచుకునే అవకాశం వుండి కూడా చేజేతులారా బీజేపి హస్తానికి అధికారం అప్పగించినట్లుగా ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఈ గందరగోళంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడంతో పాటుగా కార్యక్తర్తల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయన్న వాదన వస్తున్నది.

ఎం జరగాలి? ఎం జరిగింది? ఎందుకు జరిగింది?
మెట్‌పల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలిచిన బీజేపికి మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే సువర్ణ అవకాశం వచ్చిందనే చెప్పాలి. ఆ రోజు అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితి బీజేపికి పూర్తిగ అనుకూలంగానే వున్నదని చెప్పాలి. అక్కడ జరగాల్సింది బీజేపి చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక అన్నట్టుగానే వాతావరణం కనిపించింది. అదే గనక జరిగితే రాజకీయంగా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపికి మంచి స్థితికి వచ్చేదన్న వాదన వచ్చింది. ఫలితాలు వచ్చాకా చాలామంది బీఆరఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు కలిసిపోతారు అని చాలామంది భావించారు. బీజేపికి ఇక అధికారం అందని ద్రాక్షలే అని చాలామంది అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నిక సమయంలో అటు బీఆరఎస్, ఇటు కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని నిలబెట్టింది. దీనితో బీజేపికి రెండు విజయాలు సులభం అని అందరు భావించారు. కాని అనూహ్యంగా మీనా అనే కౌన్సిలర్ కాంగ్రెస్‌కు మద్ధతు తెలుపడంతో బీజేపి శ్రేణులు నిరాశకు లోనవడమే కాకుండా పార్టీ తీరుతెన్నులపై, క్రమశిక్షణా తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ఈ అవేశంతోనే బీజేపి జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబుపై బౌతికదాడికి దిగారు. దాడి చేసిన కార్యకర్తలు ఎందుకు విప్ సమయానికి అందించలేదు అనే ఆరోపణ చేశారు. నేను ఎం తప్పు చేసినా? నాదేం తప్పు అని యాదగిరిబాబు దాడికి దిగిన కార్యకర్తలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఈలోగా గొడవ జరగడం, మెట్‌పల్లి సిఐ అనిల్‌కుమార్ సహ పోలీసులు వచ్చి పరిస్థితిని కంట్రోల్ చేశారు.
తెర వెనుక..?
ఒక సీనియర్ బీజేపి నాయకుని కుటుంబానికి చెందిన కౌన్సిలర్ అయిన మీనా కాంగ్రెస్‌కు ఓటువేయడం వెనక భిన్నమైన ఆరోపణలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైది. ప్రస్తుతం కొలువుదీరిన మున్సిపల్ కౌన్సిల్ లో కో ఆప్షన్ సభ్యత్వం ఆ కుటుంబానికి ఇస్తామన్న వాగ్దానంతో పాటుగా ఇతరత్రా లాంఛనాలు పూర్తి చేశారన్న పుకార్లు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గం బీజేపిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఓ నాయకుని కనుసన్నల్లో ఈ కోవర్టు ఆపరేషన్ చాలా రహస్యంగా జరిగిందన్న ఆరోపణ కూడా వస్తున్నది. జిల్లా అధ్యక్షునిది కేవలం పేక్షకపాత్ర మాత్రమే అని కొందరు చెబుతున్నారు. నాటకంలో తెరమీద కనిపించే తోలుబోమ్మలాంటి పాత్రనే యాదగిరిబాబుకు ఇచ్చారని, వెనక వుండి బొమ్మను కదిలించి డ్యాన్స్‌లు చేయించింది మరికొందరు అని చెబుతున్నారు.
కార్యకర్తలు ఏం అంటున్నారంటే…!
బీజేపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావ్ మీడియా సమావేశంలో విప్ అందచేశారని చెప్పిన సమయానికి స్థానిక నాయకులు చెబుతున్న సమయానికి అసలు పొంతనే లేదు. విప్ ఎప్పుడిచ్చారు అనే సందిగ్దం వీడాలంలే జిల్లా అధ్యక్షుడు ఎన్ని గంటలకు విప్ పత్రాలను అధికారులకు అప్పగించాడు? అప్పగించిన సమయం ఎప్పుడు? అని తేలాలి. అంతేకాకుండా అధికారులకు అప్పగించిన విప్ పత్రాలు సరియైనవా? లేక కలర్ జిరాక్స్ పత్రాలో కూడా తెలియాల్సి వుంది అని చాలా మంది కార్యకర్తలు అంటున్నారు. ఒకవేళ విప్ పత్రాలు సరి అయిన సమయంలో గనుక అధికారులకు అప్పగిస్తే చట్ట ప్రకారం మీనా పై తగు చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు అంటున్నారు
ఒక పకడ్భంది ప్రణాళికతోనే కొందరు నాయకులు పార్టీని భ్రష్ఠు పట్టించే పని చేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. నిజం తెలియాలంటే జిల్లా అధ్యక్షుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అలా వీలుకాకపోతే ఎంపి ధర్మపురి అరవింద్ స్వయంగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వుందన్న వాదన వస్తున్నది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బీజేపి శ్రేణుల్లో అలజడి, నిరాశకు గురిచేసిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఈ సంఘటన అనంతరం “దేశం కోసం ధర్మం కోసం మేము బీజేపికి ఓటువేస్తే.. స్వార్థం కోసం స్వలాభం కోసం ఆ ఓటుతో వచ్చిన అధికారంతో మీరు కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా?“ అని బీజేపి సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నది మాత్రం నిజమనే వాదన వస్తున్నది.
