(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
కోరుట్ల పురపాలక సంఘం పరిధిలోని 29వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అల్లాడి శోభ ప్రవీణ్ ఎన్నికల ప్రచారంలో దూకుడు చూపుతున్నారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజున వార్డు ప్రజలతో మమేకమై కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 29వ వార్డు నుంచి తొలిసారిగా కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నానని తెలిపారు. తనను గెలిపిస్తే ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ముందుండి పరిష్కారం చూపడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.
ప్రజాసేవే రాజకీయాల లక్ష్యమని, వ్యక్తిగత లాభాల కోసం కాకుండా వార్డు భవిష్యత్తు కోసం పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ఏతిరాజం మహేష్, గిన్నెల శ్రీకాంత్, అల్లాడి మహేష్, వ్యాద సాయి ప్రశాంత్, సుదర్శన్‌తో పాటు బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, 29వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.
