
(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, నాగులపేట గ్రామంలోని నాగులమ్మ దేవాలయ నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం గ్రామ సర్పంచ్ శ్రీమతి కేతిరెడ్డి గంగాజల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ ఎన్నికల్లో దేవాలయ అధ్యక్షునిగా ఉప్పరవెల్లి నాగరాజు, కోశాధికారిగా కుంటే రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జక్కుల మల్లేశం, మాజీ సర్పంచ్ కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ పీఎస్‌ఎస్‌సి చైర్మన్ సింగిరెడ్డి నర్సారెడ్డి, కుల సంఘాల పెద్దలు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
