26.2 C
Hyderabad
Monday, September 14, 2026
No menu items!

కోరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పడిగేల శ్రీనివాస్ ఘన విజయం

(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)


ఈ సందర్భంగా పడిగేల శ్రీనివాస్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ బాధ్యతాయుతంగా పాల్గొన్న సంఘ సభ్యులందరికీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.

కోరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం 2026–27 సంవత్సర నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఈ ఎన్నికలు మధ్యాహ్నం 3:00 గంటల వరకు నిర్వహించబడగా, మొత్తం 1,667 మంది ఓటర్లలో 1,147 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 592 మంది పురుషులు, 555 మంది మహిళలు పాల్గొనగా, మొత్తం పోలింగ్ శాతం 68.8%గా నమోదైంది.
ఈ ఎన్నికల నిర్వహణను ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ షక్కరి వెంకటేశ్వర్ పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు అనంతరం అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో పడిగేల శ్రీనివాస్ గడియారం గుర్తుపై 607 ఓట్లు సాధించగా, బచ్చు శ్రీనివాస్ బీరువా గుర్తుపై 527 ఓట్లు పొందారు. దీనితో మొత్తం 80 ఓట్ల మెజారిటీతో పడిగేల శ్రీనివాస్ కోరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఘన విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
విజయం అనంతరం ఎన్నికల అధికారి శక్కరి వెంకటేశ్వర్ పడిగేల శ్రీనివాస్ కు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షులు మోటూరి రాజు, చిద్రాల అశోక్, బట్టు హరికృష్ణ, జిల్లా శ్రీనివాస్, ఎన్నికల అధికారులు ఏనుగందుల శ్రీనివాస్, పూర్ణ చందర్, చౌడారపు శ్రీనివాస్ తదితరులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా పడిగేల శ్రీనివాస్ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతూ బాధ్యతాయుతంగా పాల్గొన్న సంఘ సభ్యులందరికీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles