(బాలె అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా, కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా వద్ద జనసేన పార్టీ కోరుట్ల నియోజకవర్గ నాయకులు కొవ్వొత్తులతో సంతాపం పాటించి, కాశ్మీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు అశ్రునివాళులు అర్పించారు.
కాశ్మీర్లోని ధోడ జిల్లా, భాదేర్వ–చంబా ఇంటర్ స్టేట్ రోడ్డుపై ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నిన్న జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్ బోల్తా పడటంతో 10 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భద్రత కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు.
ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ఈ సందర్భంగా కోరారు. మృత జవాన్ల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఈశ్వర్నగర్ ఉపసర్పంచ్ బసవేని రమేష్, సీనియర్ నాయకులు వోద్నాల రామారావు, ఆడ్హాక్ కమిటీ సభ్యులు సాయికృష్ణతో పాటు జనసైనికులు విజయ్, రంజిత్, కరుణాకర్, సంపత్, సురేష్, అనిల్, సంజీవ్, శశి, రాకేష్, ప్రశాంత్, మణిదీప్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
